మ‌హేష్‌కి జాతీయ పుర‌స్కారం ఇవ్వాలి!

Saturday, April 21st, 2018, 11:44:00 PM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సీఎం పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సీఎం భ‌ర‌త్‌గా ఛార్జ్ తీసుకుని 24 గంట‌లైనా గ‌డ‌వ‌లేదు… అప్పుడే ఈ సినిమా రికార్డుల మోత గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. భ‌ర‌త్ వ‌సూళ్ల సునామీ అదే రేంజులో సాగుతోంద‌న్న రిపోర్టులు అందాయి. అదంతా అటుంచితే ఈ చిత్రంలో మ‌హేష్ న‌ట‌న‌ను ప్రేక్ష‌కాభిమానులు స‌హా ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. మ‌హేష్ అస‌మాన న‌ట‌ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించ‌నివారే లేరంటే అతిశ‌యోక్తి కాదు. రాజ‌మౌళి, వంశీ పైడిప‌ల్లి, అనీల్ రావిపూడి, రామ్ ఆచంట, సుధీర్‌బాబు.. ఇలా ఎంద‌రో మ‌హేష్ న‌ట‌న‌ను ప్ర‌త్యేకించి కీర్తించారు.

లేటెస్టుగా ఛాయాగ్రాహ‌కుడు ర‌వి.కె.చంద్ర‌న్ ట్విట్ట‌ర్‌లో మాట్లాడుతూ-“భ‌ర‌త్ అనే నేను సినిమా చూశాను. ద‌ర్శ‌కుడు శివ కొర‌టాల క‌థ‌, క‌థ‌నం, డైలాగులు, ద‌ర్శ‌క‌త్వం అద్భుతం. మ‌హేష్ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్‌కి జాతీయ అవార్డు ద‌క్కాలి. ఇలాంటి మంచి సినిమాకి ప‌ని చేసినందుకు గ‌ర్వంగా ఉంది“ అని అన్నారు. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ప్రివ్యూ వీక్షించిన అనంత‌రం ఎంతో ఉద్వేగంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఇలాంటి గ్రేట్ సినిమాకి సీక్వెల్ తీయాల‌ని అన్నాడు. ద‌య‌చేసి ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయండి….జాతీయ స్థాయిలో ఉండేలా పార్ట్ -2 తీర్చిదిద్దాలి .. అని ట్వీట్ చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments