మహేష్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయింది ?

Sunday, April 22nd, 2018, 09:22:44 PM IST


ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే అయన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి ఏడాది క్రితమే ఈ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు మహేష్. కానీ తాను అప్పుడు భారత్ అనే నేను సినిమా చేస్తుండడంతో ఆ సినిమా పూర్తయ్యాక చేద్దామని చెప్పాడు. సో వంశీ కూడా మహేష్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ సినిమాను క్రేజీ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం రంగస్థలం లాంటి సంచలన విజయాన్ని అందించిన సుకుమార్ తో మైత్రి మూవీస్ మరోసారి సినిమా చేయనుంది. తాజాగా ఈ సినిమాను కన్ఫర్మ్ చేసారు. వంశీ సినిమా అవ్వగానే సుకుమార్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. సుకుమార్ – మహేష్ ల కాంబినేషన లో వచ్చిన 1 సినిమా మేకింగ్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ అది కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదు .. అయినా సరే మహేష్ కి సుకుమార్ బాగా నచ్చేసాడు .. దాంతో మరోలా సినిమా చేయడానికి అయన సిద్ధం అయ్యాడు. ఇక మైత్రి మూవీస్ కూడా మహేష్ శ్రీమంతుడు సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మాతలు .. కాబట్టి మహేష్ వారికీ మరో ఛాన్స్ ఇచ్చేసాడు. సో త్వరలోనే ఈ సినిమాను సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.