హ్యాట్రిక్ కాంబినేషన్ లో మహేష్ – కొరటాల శివ ?

Wednesday, September 19th, 2018, 10:15:42 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ డెహ్రూడూన్ లో జరిగితే రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. ఇక మూడో షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసారు .. కానీ కొన్ని అనుకోని కారణాల వాళ్ళ ఆ ప్రయాణం వాయిదా పడింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ టీమ్ అమెరిలా వెళ్లనుంది. ఇక మహేష్ తో సినిమా చేసిన దర్శకులు మళ్ళీ మళ్ళీ ఆయనతో పనిచేయాలని కోరుకుంటున్నారు .. ఎందుకంటే మహేష్ మంచితనం, సినిమా అంటే ఉండే తపన ఇలాంటివి చాలానే క్వాలిటీస్ ఉన్నాయి. ఇక తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు మహేష్ ఛాన్స్ ఇస్తాడు.

తాజాగా తనకు శ్రీమంతుడు లాంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివ తో వెంటనే భరత్ అనే నేను సినిమా చేసి మరో హిట్ కొట్టాడు .. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుంది ? అదేంటి కొరటాల శివ నెక్స్ట్ మెగాస్టార్ తో సినిమా చేస్తానని చెప్పాడు .. సడన్ గా మహేష్ తో సినిమా ఏమిటి అని షాక్ అవుతున్నారా .. ? అసలు విషయం ఏమిటంటే మహేష్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్నది సినిమా కాదు కమర్షియల్ యాడ్. ప్రస్తుతం సినిమాలతో పాటు మహేష్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయన అభిబస్ యాడ్ కోసం కొంత సమయం కేటాయించాడు. ఈ యాడ్ ను కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు అది విషయం. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుందట.