రాజమౌళి తో సినిమా ఫిక్స్…పూరి కథ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా – మహేష్!

Sunday, May 31st, 2020, 09:05:32 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. అయితే అభిమానులతో జరిగిన ఈ సంభాషణ లో మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడే విడుదల అయింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు అభిమానులకి డబుల్ పండుగ ఇచ్చారు.

అయితే సరదాగా జరిగిన ఈ సంభాషణ లో మహేష్ బాబు తన సినిమా ల గురించి వివరించారు. రాజమౌళి తో సినిమా ఉంటుందా అని ఒక అభిమాని అడగగా, కచ్చితంగా చేస్తాను అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అని అన్నారు. అలానే మాస్ ఎంటర్టైనర్ సినిమాలను అందజేస దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందా అని అడగగా, పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాను అని, తనకు ఇష్టమైన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు అని అన్నారు. అంతేకాక కథ నరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురు చూస్తున్నా అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరి పూరి జగన్నాథ్ మహేష్ బాబు ఇచ్చిన ఈ అవకాశం ఉపయోగించుకుంటారో లేదో చూడాలి.