బిగ్ వైరల్: తన కొడుకుతో హైట్ చెక్ చేసుకున్న మహేశ్..!

Saturday, May 23rd, 2020, 02:38:21 AM IST

ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడుతో గౌతమ్ తో హైట్ చెక్ చేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. తన పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ, స్విమ్మింగ్ చేసుకుంటూ కనిపిస్తున్న మహేశ్ ఇంటి దగ్గర సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

అయితే తాజాగా తన కొడుకు గౌతమ్ కు ఎదురుగా నిల్చుని మహేశ్ హైట్ చెక్ చేసుకున్నాడు. అయితే మహేశ్ కంటే గౌతమ్ కాస్త తక్కువ హైటే ఉన్నా నెటిజన్స్ మాత్రం ఈ వీడియో చూశాక మహేశ్ లుక్ చూస్తుంటే గౌతమ్ కి మహేశ్‌ బ్రదర్‌లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.