పవర్ స్టార్ కంబ్యాక్ కోసం మహేష్ ఫ్యాన్స్ పిచ్చ వైటింగ్.!

Friday, December 13th, 2019, 01:00:22 PM IST

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థానం మళ్లీ ఎవరిది అన్న ప్రశ్న వచ్చినప్పుడు మొట్టమొదటగా అందరిలోనూ మెదిలే పేర్లు ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మరోటి సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని వారే.వీరిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే ప్రతీ చిన్న రికార్డు నుంచి పెద్ద పెద్ద రికార్డుల వరకు బద్దలు కావాల్సిందే.అలాగే ఆన్లైన్ లో కూడా ఈ ఇద్దరి అభిమానుల మధ్యనే తారా స్థాయిలో పోటీ ఉంటుంది.సో ఇద్దరు సమ ఉజ్జీలుగానే ఉంటారు.కానీ పవన్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బాగా బిజీ అయ్యిపోయారు.

కానీ తన పార్టీ ఇప్పుడు ఆర్ధికంగా నిలబడే పరిస్థితుల్లో లేదు.అలాగే భవిష్యత్తులో పార్టీ నిలబడాలి అన్నా పవన్ కు సినిమాలు చెయ్యమ్మాచెయ్యడం తప్ప మరో దారి కనపడడం లేదు.సో ఇక మళ్ళీ రీఎంట్రీ ఖరారు అని అంతా అనుకుంటున్న ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కంబ్యాక్ కోసం అతని అభిమానుల కంటే కూడా సూపర్ స్టార్ మహేష్ అభిమానులే ఎక్కువగా ఎదురు చూస్తున్నాం అంటున్నారు.బాక్సాఫీస్ దగ్గర కానీ ఇతర రికార్డులలో కానీ మీరే మాకు సమ ఉజ్జి అని అందుకే మీ గ్రాండ్ ఎంట్రీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని మా అభిమాన హీరోకు పోటీ అంటే అది పవనే అని పవన్ కం బ్యాక్ చిత్రం కోసం వీరే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.మరి వీరి కోరికలు ఫలిస్తాయో లేదో చూడాలి.