ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేష్ ఫ్యాన్స్!

Sunday, July 26th, 2020, 08:47:50 PM IST

మహేష్ బాబు పుట్టిన రోజు మరి కొద్దీ రోజుల్లో రానున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదిక గా బిగ్ ట్రెండ్ ను క్రియేట్ చేసి మహేష్ కి అడ్వాన్స్డ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశారు. అయితే మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ట్రెండ్ క్రియేట్ చేసారు. అది కాస్త ఆల్ టైమ్ రికార్డు గా సెట్ అయింది గడిచిన 24 గంటల్లో #MaheshBabuBdayCDP అనే ట్యాగ్ ను అత్యధింగా ట్వీట్ చేశారు. మొత్తం 24 గంటల్లో 3.1 కోట్లలో ట్వీట్స్ వేయడం జరిగింది.

అయితే నేషనల్ వైడ్ గా ఇదే ఇపుడు ఆల్ టైమ్ బిగ్ ట్రెండ్ గా మారింది. అయితే ఇంకా పుట్టిన రోజుకి మరింత భారీగా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే మహేష్ బాబు అభిమానులకి తన పుట్టిన రోజున ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సర్కార్ వారి పాట కి సంబంధించి టీజర్ లేదా, పోస్టర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కార్ వారి పాట వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్ట్ 9 న మహేష్ పుట్టిన రోజు ఉండటం తో ఈ చిత్రం నుండి ఖచ్చితంగా ఏదైనా సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.