“మహర్షి”..ఈ ఊహించని ట్విస్టులేంటి మహేష్..?

Tuesday, November 6th, 2018, 10:17:16 PM IST

టాలీవుడ్ చార్మ్ ఫుల్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి తో “మహర్షి” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే,అయితే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఎంత వరకు పూర్తయ్యిందో తెలీదు కానీ మహేష్ మాత్రం వారానికో కొత్త లుక్ లో దర్శనమిస్తూ అభిమానులకు మతులు పోగోతున్నారు.ఇటీవలే బులెట్ మీద ఒక సరి కొత్త లుక్ తో అదరగొట్టారు,అంతకు ముందే సూట్ లుక్ మరియు సరికొత్త హెయిర్ స్టైల్ లుక్ తో అభిమానులకు టాలీవుడ్ ప్రేక్షకులకు షాకిచ్చారు.ఒకసారి క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తున్నారు,మరో సారి మళ్ళీ గడ్డం లుక్ తో దర్శనమిస్తున్నారు,అసలు ఈ చిత్రానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలీని పరిస్థితుల్లో ఒక గందరగోళం పరిస్థితి నెలకొంది,ఈ అన్నిటిని పక్కన పెడితే మహేష్ మాత్రం కొత్త కొత్త లుక్కులతో అభిమానులకు కిక్కెస్తున్నారని చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments