మార్పు ఇంట్లోనే ప్రారంభమవుతుందంటున్న మహేశ్..!

Tuesday, July 28th, 2020, 12:40:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పుడూ ఏదో ఒక సోషల్ మెసేజ్ తన ద్వారా ఫ్యాన్స్‌కి, ప్రజలకు చేరవేస్తూనే ఉంటాడు. అయితే నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించండి అదే ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది అనేలా ఓ మెసేజ్ ఇచ్చారు.

అంతేకాదు నీటిని ఆదా చేయండి, రీసైక్లింగ్, వ్యర్థాలను ఉపయోగించడం, పునరుత్పాదక శక్తిని వాడండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని చెబుతూ ప్రారంభించడానికి ముందు ఒకదానిని ఎంచుకోండి! ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో మనల్ని మనం రక్షించుకుంటూనే, ప్రకృతిని కూడా పరిరక్షించడం మరియు రక్షించడం గుర్తుంచుకోండని మార్పు అనేది మన ఇంట్లోనే ప్రారంభమవుతుందని ట్వీట్ చేశారు.