ఇంగ్లాండ్ లో మహేష్ బాబు – టీం ఇండియా మ్యాచ్ చూస్తున్నాడుగా

Sunday, June 9th, 2019, 04:02:59 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంగ్లాండ్ లో ఇండియా ఆస్ట్రేలియా ల మధ్యన జరిగే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు… మహేష్ బాబు ఇటీవల నటించిన మహర్షి చిత్రం విజయవంతం అయిన తరువాత మహేష్ తన కుటుంబం తో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే… మహేష్ తన కుటుంబం తో కలిసి సరదాగా గడుపుతున్నటువంటి ఫోటోలను తన భార్య నమ్రత ఎప్పటికప్పుడు సామజిక మాంద్యమాల్లో పెడుతున్నారు కూడా… కాగా ఇటీవలే జర్మనీలోని పలు ప్రాంతాలు సందర్శించిన మహేష్ కుటుంబం ఆ తరువాత ఇటలీ వెళ్ళింది. ప్రస్తుతానికి మహేష్ తన కుటుంబం తో సహా ఇండియాకు ఆస్ట్రేలియా తో జరిగే క్రికెట్ మ్యాచ్ చుడానికి ఇంగ్లాండ్ కి వెళ్ళాడు. కాగా అక్కడ దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం కూడా మహేష్ కుటుంబంతో కలిసింది. అయితే స్టేడియం లో వారిరువురు కలిసిన సమయంలో తీసుకున్న సెల్ఫీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా త్వరలోనే మహేష్ బాబు మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రానున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం ప్రారంభం కానుంది…