మహేష్ మరీ లేటుగా..!

Friday, November 11th, 2016, 03:36:04 PM IST

mahesh
పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పై దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మోడీని అభినదించారు. పెద్ద నోట్లను రద్దు చేసి అవినీతిని నిర్ములించడానికి నడుం బిగించిన ప్రధాని నరేంద్రమోడీ కి అభినందనలు వెల్లువలా వచ్చాయి.అమితాబ్, రజినీకాంత్ ఇలా ప్రముఖులందరూ మోడీ చర్యని అభినందించారు. ఈ విషయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాగా వెనకబడిపోయాడు. ఎట్టకేలకు మహేష్ బాబు ఎట్టకేలకు దీనిపై స్పందించాడు. స్పందించడమే కాదు మోడీని పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు.

భారత ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా మంచి పరిణామమని మహేష్ అన్నాడు.అంతేకాక ఈ నిర్ణయం తీసుకున్న మోడీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రజలచే ప్రజలకోసం ఎన్నికైన ప్రజల మనిషికి సెల్యూట్ అంటూ మహేష్ ట్వీట్ చేసాడు. మహేష్ బాబు లేటుగా అభినందనలు తెలిపినా లేటెస్ట్ గా తెలిపాడు.