మ‌హేష్‌కి కావ‌ల్సింది కోట్లు కాద‌మ్మా!

Tuesday, September 20th, 2016, 12:01:49 PM IST

mahesh-babu
క‌థ ఎక్సైట్ చేస్తే తప్ప సినిమా చేయ‌డానికి ఒప్పుకోని క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబు. కాంబినేష‌న్ల‌కంటే క‌థే కీల‌క‌మ‌ని న‌మ్మే అతి కొద్దిమంది క‌థానాయ‌కుల్లో ఆయన ఒక‌రు. తొలినాళ్ల‌ల్లో కాంబినేష‌న్ల‌పై ఆస‌క్తితో చాలా సినిమాలు చేసి ఇబ్బందులుప‌డ్డారు. అనుభ‌వమొచ్చిన‌ప్ప‌ట్నించి మాత్రం… క‌థ న‌చ్చ‌క‌పోతే ఆయ‌న నిర్మొహ‌మాటంగా వెన‌క్కి తిప్పి పంపిస్తున్నాడు. ఇటీవ‌ల ఓ అగ్ర ద‌ర్శ‌కుడి విష‌యంలో అదే చేశాడ‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే త‌మిళంలో స్టార్ డైరెక్ట‌ర్ల‌లో సుంద‌ర్. సి. ఒక‌రు. ఆయ‌న ఓ పెద్ద బ‌డ్జెట్‌లో తెలుగు, త‌మిళంలో ఓ సినిమాని ప్లాన్ చేశాడు. అందులో మ‌హేష్ న‌టిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న్ని సంప్ర‌దించాడ‌ట‌. న‌టిస్తే
భారీగా పారితోషికం ఇస్తామ‌ని కూడా సుంద‌ర్ ఆఫ‌ర్ చేశాడ‌ట‌. కానీ మ‌హేష్ మాత్రం ఆ ప్రాజెక్టు చేయ‌డం ఇష్టం లేక నో చెప్పేశాడ‌ట‌. దీంతో సుంద‌ర్ మ‌రో హీరోని వెదికి ప‌ట్టుకొనే ప‌నిలో ఉన్నాడ‌ట‌. మ‌రి తెలుగు హీరోనే ప‌ట్టుకొని చేస్తాడా లేదంటే త‌మిళ హీరోనే చూసుకొంటాడా అన్న‌ది చూడాలి. అన్న‌ట్టు మ‌హేష్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు ఆయ‌న కోసం క్యూలో ఉన్నారు. వాళ్ల‌తో చేయాల‌నే సుంద‌ర్ సి.కి నో చెప్పినట్టు ప్ర‌చారం సాగుతోంది.