అనుకున్నట్లే మహేష్ ఆ రికార్డ్ అందుకున్నాడు!

Tuesday, January 23rd, 2018, 11:05:23 AM IST

మహేష్ బాబు – కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో బాహుబలి తరువాత ఆ సినిమా రికార్డులే ఎక్కువగా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఆ కాంబో లో వస్తోన్న మరో సినిమా భరత్ అనే నేను శాటిలైట్ రైట్స్ పై గత కొంత కాలంగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయని అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా రూమర్స్ అన్ని నిజం అయ్యాయి. సినిమా శాటిలైట్ హక్కులు మొత్తంగా రూ.39 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇంతవరకు మహేష్ కెరీర్లో ఏ సినిమాకు ఈ స్థాయిలో అఫర్ రాలేదు. దీంతో సినిమా నిర్మాతకు రిలీజ్ కు ముందే మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ఇక గత కొన్ని రోజుల క్రితం ఆడియో హక్కులు కూడా మంచి రేట్ గా అమ్ముడు పోగా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. రాజకీయ నేపథ్యంలో వస్తిన్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కానుంది.