మహేష్ మీద మహేష్ ఫ్యాన్సే సెటైర్లు..!

Thursday, February 27th, 2020, 04:59:18 PM IST

ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ చెయ్యబోయే సరికొత్త ప్రాజెక్ట్ కోసం హడావుడి మాములుగా లేదని చెప్పాలి.వంశీతో తెరకెక్కించిన “మహర్షి” తర్వాత అనీల్ రావిపూడితో “సరిలేరు నీకెవ్వరు” చిత్రాన్ని మొదలు పెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు.కానీ దీని తర్వాత మహేష్ మొదలు పెట్టబోయే సినిమా పై మాత్రం రోజుకొక సరికొత్త రూమర్ పుట్టుకొస్తుంది.

అయితే రూమర్లు అని కాదు కానీ ఇంకా దాదాపు ఇది కన్ఫర్మ్ అన్న రేంజ్ లో గత కొన్ని రోజుల నుంచి ప్రచారాలు జరుగుతున్నాయి.వంశీతో సినిమా లేట్ అయ్యేలా ఉందని మహేష్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని అబ్బో గత వారం నుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్కు..ఇందులో ముఖ్యంగా ఈ వార్తలను ప్రచారం చేసిన వారిలో ఎక్కువ మహేష్ ఫ్యాన్సే ఉన్నారు.

దీనితో మహేష్ ఫ్యాన్స్ తాలూకా కొన్ని పేస్ బుక్ మరియు ట్విట్టర్ హ్యాండిల్స్ వారు ఇలా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ లను ఉద్దేశించి మహేష్ డైలాగ్స్ తో మహేష్ కే ఫన్నీ సెటైర్లు వేసేస్తున్నారు.మహేష్ కు తెలీకుండానే చిరు కొరటాల సినిమాలో నటిస్తున్నారని అప్పుడే నా ఫ్యాన్సే నాకు తెలీకుండా 30 రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చేసానని చెప్తున్నారంట అన్న టైపులో కొంత మహేష్ అభిమానులే పోస్టులు వేస్తున్నారు.