టాలీవుడ్ పరువు తీస్తున్న మహేష్ బాబు అభిమానులు…విజయ్ పై మరి ఇంత దారుణంగా!

Tuesday, March 31st, 2020, 08:40:02 PM IST

సోషల్ మీడియా లో గత కొద్ది రోజులుగా మహేష్ మరియు విజయ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. Remakestarvijay అనే హష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది.మహేష్ బాబు నీ ట్రొల్ చేస్తున్న విజయ్ అభిమానులకు ప్రతిస్పందనగా ఇలా చేస్తున్నారు.అయితే ఇపుడు ఈ విషయం టాలీవుడ్ లో చర్చంశనీయం అయింది. మహేష్ అభిమానులు ఇపుడు ఈ హాష్ ట్యాగ్ నీ ట్రెండ్ చేస్తున్నారు.

అయితే విజయ్ తన కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన గిల్లి, పొక్కిరి చిత్రాలు మహేష్ బాబూ తీసిన ఒక్కడు, పోకిరి సినిమాలకు రీమేక్ చిత్రాలు. అయితే మరో విషయం ఏమిటంటే మాస్టర్ సినిమా ప్రి రిలీజ్ వేడుక జరపడం వలన పలువురు విజయ్ తీరుని తప్పు బడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించే సమయంలో అల చేయడం పట్ల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు కరోనా వైరస్ మహమ్మారి నీ నివారించేందుకు తమ వంతు సాయం గా విరాళాలు ఇస్తుంటే విజయ్ ఇప్పటివరకు విరాళం ప్రకటించనందుకు పలువురు ప్రముఖులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.