మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ రెడీ అయిపోవాలమ్మా.!

Sunday, June 21st, 2020, 02:59:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వరుస విజయ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

టాలీవుడ్ అత్యధిక గ్రాసర్స్ లో ఒకటి గా నిలిచింది. ఇదే అనుకుంటే ఆ తర్వాత జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ చెయ్యగా బుల్లితెర రికార్డులను కూడా ఒక చూపు చూసింది. తెలుగు సినిమా హిస్టరీ లోనే ఏ సినిమాకు రానంత టీఆర్పీ రేటింగ్ ఈ చిత్రం సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

కానీ అప్పుడు టెలికాస్ట్ ప్రింట్ కు జెమినీ టీవీపై మహేష్ ఫ్యాన్స్ నుంచి చాలానే విమర్శలు వచ్చాయి. దీనితో ఈసారి ఫుల్ హెచ్ డి ఆడియో మరియు వీడియో క్వాలిటీతో టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. కానీ అనుకోని కారణాల వల్ల అప్పుడు ఆ చిత్రం ఆగిపోవాల్సి వచ్చింది.

దీనితో మొదటిసారి మామూలు ప్రింట్ తోనే బొమ్మ దద్దరిల్లితే రెండోసారి మరింత క్వాలిటీ ఉన్న ప్రింట్ తో వస్తే ఇంకెలా ఉంటుందో అని అభిప్రాయ పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ అందుకు టైం వచ్చింది. ఈ చిత్రాన్ని రెండో టెలికాస్ట్ గా జెమినీ టీవీ అతి త్వరలోనే తీసుకురానున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈసారి ఎంత టీఆర్పీ వస్తుందో చూడాలి.