మహేష్ అభిమానుల పడిగాపులు మామూలుగా లేవు.!

Sunday, October 20th, 2019, 06:04:58 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” ఈ చిత్రం ఎన్నో అంచనాలను మూటగట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చెప్పి ప్రకటన ఇచ్చారు అంతే కాకుండా ఆ మధ్య కూడా చిన్న అప్డేట్స్ తో చిత్ర యూనిట్ హోరెత్తించి అభిమానుల కళ్ళల్లో ఆనందం నింపారు.కానీ ఇప్పుడు మాత్రం సినిమాకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ ను కూడా ఇవ్వకపోవడంతో మహేష్ అభిమానులు కాస్త నిరాశలోనే ఉన్నారు.

ఎందుకంటే ఇప్పుడు దీపావళి సీజన్ కాబట్టి ఇతర హీరోల సినిమాలకు అప్డేట్స్ ఇప్పటికే వచ్చేసాయి.కానీ ఈ చిత్రానికి మాత్రం ఎలాంటి అప్డేట్ ను ఇవ్వకపోగా గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ కూడా సైలెంట్ గా ఉంటుంది దీనితో ఈ దీపావళికి ఏదన్నా అప్డేట్ ఉందా లేదా అని అభిమానులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.కొంతమంది అయితే ఇప్పుడు అప్డేట్ ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీపావళికి ఏదో ప్లాన్ చేసే ఉంటారని అభిమానులు వారిలో వారికే ధైర్యం చెప్పుకుంటున్నారు.మరి చిత్ర యూనిట్ వీరిని ఆనందపరచడానికి ఈ దీపావళి రోజున ఏం చేస్తారో చూడాలి.