గట్టి కారణంతో “సరిలేరు నీకెవ్వరు” లేట్ రిలీజ్ చెయ్యమంటున్న ఫ్యాన్స్.!

Friday, October 18th, 2019, 06:26:39 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే అంతకు ముందున్న సినిమాల తాలూకా రికార్డులకు బీటలు వారడం తప్పదని చెప్పాలి.అలాంటి అగ్ర శ్రేణి నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే మొదటి రోజు రికార్డుల మోత మోగిపోవాల్సిందే.

అయితే ఇప్పుడు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు.కానీ తన చివరి సినిమా “అజ్ఞ్యాతవాసి” నెలకొల్పిన డే వన్ రికార్డు మాత్రం ఇంకా పదిలంగానే ఉండిపోయింది.సింగిల్ లాంగ్వేజ్ లో విడుదల అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్ గా ఇప్పటికి పవన్ పేరిటే రికార్డు ఉంది.అయితే పవన్ రికార్డులను తిరగరాయగలిగే సత్తా మళ్ళీ టాలీవుడ్ లో మహేష్ బాబుకే ఉంది.

కానీ పవన్ సినిమా తర్వాత మహేష్ వి రెండు సినిమాలు వచ్చినా సరే ఎందుకో దగ్గరలోకి వచ్చి ఆగిపోయాయి.కానీ ఈసారి మాత్రం ఈ రికార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దలు కొట్టాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.అందుకోసమే ఇప్పుడు అనీల్ దర్శకతంలో చేస్తున్న “సరిలేరు నీకెవ్వరు” జనవరి 12న వద్దంటే వద్దు అంటున్నారు.

ఎందుకంటే అదే రోజున త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ సినిమా “అల వైకుంఠపురములో” కూడా విడుదల ఉంది.సో ఈ రెండు చిత్రాల ఓపెనింగ్స్ కు ఖచ్చితంగా గండి పడతాయి.దీనిని దృష్టి పెట్టుకొని అదే రోజున కానీ మహేష్ సినిమా వస్తే పవన్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టం అవుతుందని అందుకే సోలోగా విడుదల చేస్తే మరింత భారీ వసూళ్లు రావడం ఖాయమని అభిమానులే అభిప్రాయపడుతున్నారు.