మహేష్ సినిమా షెడ్యూల్ మారిందా ?

Friday, June 1st, 2018, 03:34:23 AM IST

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుండి మొదలు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా అమెరికాలో షూటింగ్ మొదలు పెట్టి ఎక్కువ భాగం అక్కడే జరపాలని ప్లాన్ చేసారు .. అయితే ఎందుకో టీమ్ మళ్ళీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు అమెరికాలో లొకేషన్స్ వేటలో ఉన్న వంశీ .. తాజగా నార్త్ ఇండియా డెహ్రూడున్ లోకూడా లొకేషన్స్ సెర్చ్ చేసాడు. అందుకే డెహ్రూడున్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. జూన్ రెండో వారంలో మొదలు పెట్టి ఆ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ చేస్తారట. ఆ తరువాత హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. అల్లరి నరేష్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments