మహేష్ బాబు కి ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ తనేనట!

Sunday, May 31st, 2020, 11:37:52 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ జరిపారు. అయితే ఈ నేపధ్యంలో మహేష్ బాబు ను అభిమానులు రకరకాల ప్రశ్నలు అడిగారు. అయితే మహేష్ మాత్రం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే మహేష్ బాబు ను మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరూ అని అడగగా తన స్టయిల్లో క్లాసిక్ సమాధానం ఇచ్చారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరియు ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్లు చెబుతూనే, ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అంటూ సచిన్ టెండూల్కర్ పేరును చెప్పారు.

ఈరోజు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట టైటిల్ ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అయితే ఈ టైటిల్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ తనకు జీవితంలో ఇన్స్పిరేషన్ తన తండ్రి కృష్ణ అని అన్నారు.మహేష్ బాబు కి మార్వెల్ హీరోస్ లో ఐరన్ మ్యాన్ మరియు హల్క్ లు ఇష్టం అని వ్యాఖ్యానించారు. అంతేకాక మైండ్ బ్లాంక్ అంటూ క్రికెటర్ వార్నర్ స్టెప్పుల పై స్పందిస్తూ, అతను అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.తన క్రష్ గా, స్నేహితునిగా తన భార్య నమ్రత శిరోద్కర్ పేరు ను మహేష్ అభిమానులకు వెల్లడించారు.