తెలంగాణ నేపథ్యంలో సినిమా .. నో అన్న మహేష్ ?

Wednesday, October 24th, 2018, 10:12:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మహర్షి చిత్రం షూటింగ్ న్యూ యార్క్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మీడియాలో ఓ రేంజ్ బుజ్ ఏర్పడింది. ముక్యంగా ఈ సినిమాకోసం మహేష్ న్యూ గెటప్ లో అదిరిపోయే లుక్ తో ఉన్న ఫోటోలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను క్రేజీ దర్శకుడు సుకుమార్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుకుమార్ మహేష్ కోసం ఇప్పటికే రెండు కథలు చెప్పాడట.

అందులో ఒకటి మాములు ఎంటర్ టైనర్ అయితే .. రెండో కథ తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని .. అదికూడా భారత దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో … అంటే 1947 లో ఇంకా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం రాని కాలంలో ఆ కథ ఉంటుందని చెప్పాడట ? అందులో తెలంగాణ ప్రజల పై రజాకార్ల దారుణాలు నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అయితే ఇదేదో కాంట్రవర్సీ అయ్యేలా ఉందన్న ఆలోచనతో మహెష్ ఈ స్క్రిప్ట్ వద్దన్నాడట, దాంతో సుకుమార్ మరో కథపై కసరత్తు చేస్తున్నాడట. అది విషయం. ఒకవేళ మహేష్ ఆ సినిమా చేస్తే నిజంగా పెద్ద సంచలనం అయ్యేదేమో !! మరి ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా ఉంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments