ఎన్టీఆర్ బయోపిక్ – కృష్ణ పాత్రలో మహేష్ ?

Monday, October 29th, 2018, 03:47:15 PM IST

బాలయ్య, క్రిష్ ల కాంబినేషన్ ల వస్తున్న ఎన్ఠీఆర్ బయోపిక్ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇందులోని చాలా పాత్రలకు నటులను ఎంపిక చేసారు, వాటి ఫస్ట్ లుక్స్ కూడా విడుదలై అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం విషయం లో ఎప్పటినుండో వినిపిస్తున్న గాసిప్ కృష్ణ పాత్ర లో మహేష్ నటించబోతున్నాడు అని.

ఇప్పుడు ఈ గాసిప్ నిజమయ్యే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. బాలకృష్ణ స్వయానా ఫోన్ చేసి మహేష్ ను కృష్ణ పాత్రలో నటించమని కోరగా, మహర్షి సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికా లో ఉన్న మహేష్ ఈ పాత్రలో నటించాల వద్ద అన్న విషయం పై నిర్ణయం తీసుకోవటానికి కొంత సమయం పడుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహర్షి సినిమాకి సంబందించిన షెడ్యూల్ అమెరికాలో జరుగుతుంది, ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మహేష్ షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చేయవరకు ఆగాల్సిందే అనమాట.

ఎన్టీఆర్ – కృష్ణల మధ్య మంచి సంబంధాలే ఉండేవి అప్పట్లో, అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయటం తో కృష్ణ విభేదించారు, అయినప్పిటికి ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి అభిమానం అలాగే అలాగే ఉండేదట. అయితే ఈ సినిమా లో కృష్ణ పాత్ర తప్పకుండ ఉంది తీరాలన్నది బాలయ్య ఆలోచన అట. కాగా మహేష్ ఒప్పుకోకపోతే ఈ సినిమా నుండి కృష్ణ పాత్ర ని తొలగించాలని క్రిష్ అనుకుంటున్నారట. భారత్ అనే నేను సినిమా లో ఒక సీన్ మహేష్ మీసకట్టు తో కనపడగా అందరూ నాన్న గారిలాగే ఉన్నాడంటూ మెచ్చుకున్నారు. మరోసారి బాలయ్య కోసం మహేష్ మీసం పెట్టుకుంటాడా అనేది వేచి చూడాలి.