మ‌హేష్ ఈవెంట్‌కి `మా` ఇచ్చిన‌ పంచ్‌!?

Friday, October 26th, 2018, 02:01:33 PM IST

మ‌హేష్ ముఖ్య అతిధిగా ఈనెల 27న అమెరికాలో జ‌ర‌గాల్సిన చారిటీ ఫండ్ రైజింగ్‌ ఈవెంట్ అర్థాంత‌రంగా ర‌ద్ధ‌యిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో భారీ ఎత్తున ప్లానింగ్ చేసిన ఈ ఈవెంట్‌తో అంతే దండీగా నిధి సేక‌రించి, దానిని ఓ సామాజిక కార్య‌క్ర‌మానికి వినియోగించాల‌ని న‌మ్ర‌త మ‌హేష్ భావించారు. కానీ ఈ ఈవెంట్ అర్థాంత‌రంగా ర‌ద్ద‌యింది. ఈవెంట్‌ విష‌యంలో మిడిల్ డ్రాప్ అవ్వ‌డం టాలీవుడ్‌లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. వాస్త‌వానికి ఈ ఈవెంట్‌ని మ‌హేష్, న‌మ్ర‌త బృందం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించారు. కానీ అనూహ్యంగా ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఇది పోస్ట్ పోన్ అయ్యింది.

అయితే అందుకు కార‌ణ‌మేంటి? అని విశ్లేషిస్తే .. చారిటీ ఈవెంట్‌కి సంబంధించిన టిక్కెట్లు ఇన్‌టైమ్‌లో అమ్ముడు కాక‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి మ‌హేష్‌కి అమెరికా ఎన్నారైల్లో బోలెడంత క్రేజు ఉంది. అయినా ఇటీవ‌ల టాలీవుడ్ లో నెల‌కొన్న ప‌రిస్థితుల ప్ర‌భావం ఈవెంట్‌పై ప‌డిందిట‌. మూవీ ఆర్టిస్టుల సంఘంలో కొట్లాటలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాల్ని ఎన్నారైలు సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించారుట‌. దీంతో అమెరికాలో ఏ ఈవెంట్ జ‌రిగినా ఇక‌పై ఇదే స‌న్నివేశం నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇదివ‌ర‌కూ మెగాస్టార్‌ని ముఖ్య అతిధిగా పిలిచి కోట్ల‌లో దండుకున్న మా అసోసియేష‌న్ లెక్క‌లు చెప్ప‌డంలో విఫ‌ల‌మైంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కార్య‌ద‌ర్శినే బ‌య‌ట‌పెట్టి వివాదానికి తెర తీయ‌డంతో పెద్ద ర‌చ్చ‌య్యింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ చారిటీ ఈవెంట్‌ని ప్లాన్ చేసినా అది ఫ్లాపైంది. ఇదొక్క‌టే కార‌ణం కాదు.. అస‌లు ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేసిన ఫ్లాప్ డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ వ‌ల్ల కూడా టిక్కెట్లు స‌రిగా అమ్ముడు పోలేద‌ని తెలుస్తోంది. దీంతో మెహ‌ర్‌పై న‌మ్ర‌త చాలానే సీరియ‌స్ అయ్యార‌ట‌. ఇక అన్నిటినీ అధిగ‌మించి ఎలాగైనా ఈ ఈవెంట్‌ని నిర్వ‌హించాల‌ని న‌మ్ర‌త భావిస్తున్నారు. త‌దుప‌రి తేదీని చెబుతార‌ట‌. ఈలోగానే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది కాబ‌ట్టి, ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో అమ్ముడైన టిక్కెట్ల‌కు డ‌బ్బుల‌ను కొనుక్కున్న‌వారికి తిరిగి వెన‌క్కి ఇచ్చేసే ఏర్పాటును చేశార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments