మహేష్ – విజయ్ మల్టి స్టారర్.. నెగిటివ్ రోల్ లో మహేష్

Saturday, September 30th, 2017, 03:15:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా ప్రస్తుతం మిక్సిడ్ టాక్ తో ముందుకు వెళుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కింది. ఒకేసారి తెలుగు తమిళ్ లో దర్శకుడు మురగదాస్ తనదైన శైలిలో తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ మరొక సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మురగదాస్ మహేష్ – విజయ్ తో మల్టి స్టారర్ మూవీ తియ్యాలని ఉందని ఇది వరకే చెప్పాడు. కాని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక డౌట్ ఉందని వివరించాడు. అయితే త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మురగదాస్ దగ్గర ఆ స్క్రిప్ట్ రెడీగా ఉందట. అయితే ఈ సినిమాలో స్పెషల్ ఏమిటంటే.. ఎవరో ఒకరు విలన్ గా కనిపించక తప్పదట. అంటే తెలుగులో మహేష్ హీరోగా విజయ్ విలన్ గా చేస్తారట.. ఇక తమిళ్ లో రివర్స్ గా విజయ్ హీరో – మహేష్ విలన్. మరి ఈ సినిమాను మహేష్ ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలెదు. మరి సూపర్ స్టార్ మహేష్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో..

  •  
  •  
  •  
  •  

Comments