సరిలేరు నీకెవ్వరు స్టోరీ లీక్.. కథ అదేనా..!

Tuesday, October 15th, 2019, 12:10:18 AM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వర్క్స్‌లలో బిజీబిజీగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి దసరా కానుకగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అయితే ఆ పోస్టర్‌లో మహేష్ గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిలబడి ఉన్న స్టిల్ మహేశ్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. అయితే ఒక్కడు సినిమాలో కర్నూల్‌లోని కొండా రెడ్డి బురుజు దగ్గర జరిగిన ఫైట్ సన్నివేశాలు మళ్ళీ ఇప్పుడు సరిలేరు సినిమాలో కనిపించనున్నాయి. అయితే ఈ సినిమాలో మాత్రం కొండా రెడ్డి బురుజు సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసరుగా కనబడాల్సిన మహేష్ ఇలా గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడని అందరు అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని మహేష్ తన ఫ్రెండ్ చనిపోతే ఎవరు చంపారు అనేది తెలుసుకోవడానికి కర్నూల్ వెళ్తాడని అదే సినిమా అసలు కథ అన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.