డీసెంట్ గా స్టార్ట్ అయిన మహానటి షేర్స్

Friday, May 11th, 2018, 02:50:18 AM IST

ఎన్నడు లేని విధంగా టాలీవుడ్ లో మొదటి సారి తెరకెక్కిన బయోపిక్ మహానటి. ఒక తెలుగు సినీ నటి జీవితం తెరపై చూడటం అందరికి ఎంతగానో నచ్చింది. మహానటి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సావిత్రి జీవితాన్ని నిజాయతీగా చూపించిన దర్శకుడికి అభినందనలు అందుతున్నాయి. సినీ విశ్లేషకులు సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఇకపోతే ఏపి తెలంగాణాలో చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ను అందుకుంది. షేర్స్ పరంగా మొదటి రోజు సినిమా దాదాపు 1.5 కోట్ల దగ్గరకు వసూలు చేసింది. సినిమా థ్రియేటికల్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ఉన్న టాక్ ను బట్టి సినిమా చుస్తే సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

ఏపి తెలంగాణాలో వచ్చిన షేర్స్

నైజం – 0.66కోట్లు
ఉత్తరాంధ్ర – 0.18కోట్లు
సీడెడ్ – 013కోట్లు
గుంటూరు – 0.09కోట్లు
కృష్ణ – 0.15 కోట్లు
తూర్పు – 0.10 కోట్లు
వెస్ట్ – 0.06 కోట్లు
నెల్లూరు – 0.04 కోట్లు
AP / TG – 1.41Cr కోట్లు