రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : మజ్ను – పేరుకి తగ్గట్టే బాగా ప్రేమించాడు ..!

Saturday, September 24th, 2016, 06:31:29 PM IST

majnu
తెరపై కనిపించిన వారు : నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ

కెప్టెన్ ఆఫ్ ‘మజ్న’ : విరించి వర్మ

మూల కథ :
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే ఆదిత్య(నాని), సుమ(ప్రియా శ్రీ) అనే అమ్మాయిని తోలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇక ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నిజాయితీగా పాత ప్రేమ కథని ఆమెతో చెప్తాడు. అతని నిజాయితీని చూసి సుమ కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆదిత్య మాత్రం మనసులో తన పాత ప్రేయసినే ప్రేమిస్తుంటాడు.

ఏ విషయాన్నే రియలైజయి ఏం చేయాలో అర్థంకాక సందిగ్ధంలో ఉంటాడు. ఇంతలో వీరిద్దరి మధ్యకి ఆదిత్య పాత లవర్ కిరణ్ (అను ఇమ్మానుయేల్) ప్రవేశిస్తుంది. దీంతో వీరి ప్రేమ కథ కష్టాల్లోకి వెళుతుంది. ఈ కష్టాల్లో ఆదిత్య తన పాత, కొత్త ప్రేయసిలను ఒకేసారి ఎలా ఫేస్ చేశాడు? చివరికి ఎవరి ప్రేమను దక్కించుకున్నాడు ? అన్నది తెరపై చూడవలసిన సినిమా.

విజిల్ పోడు :

1. దర్శకుడు విరించి వర్మ హీరో పాత ప్రేమ కథని చాలా సహజంగా ఉండేలా రాసుకుని అందంగా తెరపైకెక్కించాడు. మొదటి భాగంలో వచ్చే ఈ లవ్ స్టోరీ సినిమా మొత్తానికీ హైలెట్ గా నిలిచింది. దీనికి మొదటి విజిల్ వేయొచ్చు.

2. హీరో నాని నటన చాలా అద్భుతంగా ఉంది. సహజ నటుడు అన్న పేరుకు చేశాడు నాని. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో నడిచే లవ్ స్టోరీలో, క్లైమాక్స్ ఎపిసోడ్ లో, అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాల్లో దుమ్ము రేపాడు. కాబట్టి నానికి రెండో విజిల్ వెయ్యొచ్చు.

3. ఇక సినిమాని అందంగా ప్రధానంగా భీమవరం బ్యాక్ డ్రాప్ లో సాగే హీరో పాత ప్రేమ కథని చాలా సహజంగా, ఆహ్లాదకరంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతగా తెర మీద ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ పని తనానికి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. ఇప్పుడొచ్చే ప్రేమ కథా చిత్రాల నుండి ప్రేక్షకులు బలమైన కథను కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ అంట బలమైన, కొత్తదైనా కథేమీ లేదు. ఇది సినిమాకి ఓ పెద్ద ఢమ్మాల్.

2. సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లలో మొదట కనిపించే సుమ పాత్ర పోషించిన హీరోయిన్ (ప్రియా శ్రీ)కి క్యారెక్టర్ అంత ప్రభావవంతంగా లేక కథలో తేలిపోయింది.

3. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మొదటి భాగం బాగానే ఉన్న రెండవ భాగం చాలా వరకు రొటీన్ గా సాగుతూ, ముందుగానే ఊహించే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ తో బోర్ కొట్టించింది. ఇది కూడా సినిమాకి మరో డుమ్మీల్ పాయింట్.

దావుడా – ఈ సిత్రాలు చూశారు ..!!

–> ఒక అమ్మాయిని ప్రేమలోకి దింపడానికి చేసే ప్రయత్నంలో హీరో నిజాయితీగా తన ప్రేమ కథను ఆ అమ్మాయికి చెప్తూ తానింకా తన పాత లవర్ నే ప్రేమిస్తున్నానని రియలైజ్ అవుతాడు. అదెలాగో అస్సలు అర్థం కాదు. ముందెప్పుడూ ఆ అమ్మాయిని గురించి ఆలోచించకుండా, కొత్తగా అప్పుడే ఆలోచిస్తున్నట్టు ఉండే ఆ సన్నివేశం చూస్తే దావుడా.. అనాల్సిందే.

–> అలాగే క్లైమాక్స్ లో హీరోయిన్ సదన్ గా మనసు మార్చేసుకుంటుంది. అప్పటి దాకా చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఆమె పెద్దగా ఏం జరగకుండానే అలా మారిపోవడం సిత్రమే మరి.

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : అరే… ఈ లవ్ స్టోరీలో నాని నటన ఇరగదీశాడు కదరా..!
మిస్టర్ బి : అవును నాని చంపేశాడు. ముఖ్యంగా మొదటి ప్రేమ కథలో భలే ప్రేమించాడు.