ఎఫైర్‌కి ముగింపు.. 2019లో పెళ్లేన‌ట‌!?

Saturday, October 27th, 2018, 11:17:38 PM IST

గ‌త కొంత‌కాలంగా మ‌లైకా అరోరాఖాన్ భ‌ర్త‌కు విడాకులిచ్చి ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్‌తో మ‌లైకా ఎఫైర్ ఆల్‌టైమ్ హాట్ టాపిక్‌. 45 ఆంటీతో 33 కుర్ర‌హీరో ఎఫైర్! అంటూ బాలీవుడ్ ఠాంఠాం మోగిస్తోంది. ఇదివ‌ర‌కూ ఓ టీవీ రియాలిటీ షో లైవ్‌లో చెయ్యి చెయ్యి క‌లిపి స్టెప్పులేస్తూ సంద‌డి చేశారు. మొన్న‌టికి మొన్న ఇట‌లీలో జ‌రిగిన మ‌లైకా 45వ పుట్టిన‌రోజు వేడుక‌లో అర్జున్ ముఖ్య అతిధి. అట్నుంచి వ‌స్తూ ముంబై విమానాశ్ర‌యంలో దొరికిపోయారు.

క‌ట్ చేస్తే.. నేడు మ‌రో వేడెక్కించే అప్‌డేట్ అందింది. ఆ ఇద్ద‌రూ వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌దే ఆ వేడెక్కించే వార్త‌. మ‌లైకా ముంబైకి రాగానే త‌న ఫ్రెండ్స్ బిలీటెడ్‌గా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అర్జున్ ముఖ్య అతిధిగా ఎటెండ్ అయ్యాడు. ఈ పార్టీ సాక్షిగా లీకైన సంగ‌తి ఇది. మ‌లైకా- అర్జున్ ఒక‌రంటే ఒక‌రు విడిచి ఉండ‌లేనంత క్లోజ్‌గా ఉన్నారు. త‌న‌తో జీవ‌నం అర్జున్‌కి హ్యాపీనే. అందుకే అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేసేందుకు వ‌చ్చే ఏడాది పెళ్లికి రెడీ అవుతున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.