హీరోయిన్ల‌ మేనేజ‌ర్‌ జ‌ల‌గ‌లాంటోడు?!

Wednesday, October 17th, 2018, 02:47:51 PM IST

మీటూ ఇండియా ఉద్య‌మం ధ‌డ‌ధ‌డ‌లాడిస్తోంది. పెద్ద పెద్దోళ్ల‌నే ఆటాడిస్తోంది. ఆట‌లో చివ‌రికి గింజే అనిపిస్తోంది. నానా ప‌టేక‌ర్, రెమో డి సౌజా, సుభాష్ ఘ‌య్, వికాస్ బాల్, అలోక్ నాథ్, .. ఇలా వేధింపుల క‌ళాకారుల్ని ఓ ఆటాడుకుంటున్నారు బాధిత‌ క‌థానాయిక‌లు, న‌టీమ‌ణులు. ఎవ్వెరి డాగ్ హ్యాజ్ ఏ డే.. ఈ కుక్క‌కు ఈ రోజొచ్చింది! అన్న చందంగా ర‌ఫ్ఫాడేస్తున్నారు.

ఈ వేట‌లో ఎవ‌రూ ఊహించ‌నంత పెద్ద జ‌ల‌గ తాజాగా అడ్డంగా చిక్కింది. ర‌క్తం పీల్చి పిప్పి చేసే అతి పెద్ద జ‌ల‌గ ఇద‌న్న మాటా వినిపిస్తోంది. ఆడాళ్ల మాన మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించేందుకు ఏమాత్రం వెన‌కాడ‌ని అతిపెద్ద క‌ర్క‌శ జ‌ల‌గ‌ ఇది. అందుకే ఏకంగా `క్వాన్` లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క కంపెనీ నుంచే ఉద్వాస‌న ప‌లికార‌ని చెబుతున్నారు. బాలీవుడ్‌లో స్టార్ ఈవెంట్ మేనేజ‌ర్‌గా ద‌శాబ్ధాల పాటు స‌ర్వీస్ అందించిన అనిర్ బాన్ బ్లా పై ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు న‌టీమ‌ణులు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు గుట్టు అంతా బ‌య‌టికొస్తోంది. అయితే అనిర్ బాన్ బ్లా త‌ప్పు చేశాడా.. లేదా? అన్న‌ది పోలీసులు విచార‌ణ‌లో తేల్చాల్సి ఉంది. ఇప్ప‌టికైతే అత‌డిని కంపెనీ నుంచి తొల‌గించార‌న్న మాటా వినిపిస్తోంది. ఇక అత‌గాడు. దీపిక పొదుకొనే, హృతిక్ రోష‌న్‌, సోన‌మ్ క‌పూర్, ర‌ణ‌బీర్ క‌పూర్, టైగ‌ర్ ష్రాఫ్‌, కార్తీక్ ఆర్య‌న్, శ్ర‌ద్ధా క‌పూర్, కృతి స‌నోన్ .. ఇలా అంద‌రూ టాప్ స్టార్ల‌కు బ్రాండ్ సెట్ట‌ర్‌గా సేవ‌లందిస్తున్నాడు. భారీ కార్పొరెట్ డీల్స్ సెట్ చేయ‌డంలో ఆయ‌న్ని కొట్టేవాళ్లే లేర‌న్న మాటా వినిపిస్తోంది. ఇంత‌కీ ఈయ‌న జాబితాలో ఎవ‌రైనా టాలీవుడ్ స్టార్లు ఉన్నారా?.. తెలియాలంటే.. కీప్ వాచింగ్ దిస్ స్పేస్ .. ఫ‌ర్ మోర్ అప్‌డేట్స్..

  •  
  •  
  •  
  •  

Comments