రేయ్ .. సింపుల్ క్వ‌శ్చ‌న్ అడుగు!

Friday, October 19th, 2018, 10:46:34 AM IST

ద‌స‌రా పండ‌గ వేళ గ‌మ్మ‌త్త‌యిన మ‌త్త‌యిన సంద‌ర్భ‌మిది. పండ‌గ వేళ స‌ర‌దా స‌ర‌దాగా అభిమానుల‌తో సామాజిక మాధ్య‌మాల్లో ముచ్చ‌టించిన మంచు ల‌క్ష్మీకి ఊహించ‌ని ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. మీటూ ఉద్య‌మం గురించి, శ్రీ‌రెడ్డి గురించి, ప‌లువురు అభిమానులు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశారు. వాటికి ల‌క్ష్మీ మంచు అంతే ఆస‌క్తిక‌ర స‌మాధానాల్ని చెప్పారు.

ఇంత‌కీ ఏ ప్ర‌శ్న‌లు అడిగారు? అంటే… ఇదివ‌ర‌కూ శ్రీ‌రెడ్డి వేధింపుల వ్య‌వ‌హారం గురించి మాట్లాడిన‌ప్పుడు త‌న‌కు స‌పోర్టునివ్వ‌కుండా .. అస‌లు కాస్టింగ్ కౌచ్ అన్న‌దే లేద‌ని అన్నారు. కానీ చిన్మ‌యి లాంటి ప్ర‌ముఖురాలు ఈ వేధింపుల్లో బ‌య‌ట‌ప‌డితే త‌నకు మాత్రం స‌పోర్టునిస్తున్నారు అంటూ చిక్కు ప్ర‌శ్న ఎదురైంది. దానికి ప్ర‌తిగా స్పందించిన ల‌క్ష్మీ మంచు సూటిగా స‌మాధానం ఇవ్వ‌లేదు. త‌ప్పు జ‌రిగితే నేనెపుడూ వ్య‌తిరేకిస్తాను. వాయిస్ ఆఫ్ ఉమెన్ (వావ్‌) తో మ‌హిళ‌లు ధైర్యంగా స‌మ‌స్య‌ల్ని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌పంచాన్ని బెట‌ర్‌గా తయారు చేద్దాం“ అని పిలుపునిచ్చారు లక్ష్మీ. వావ్ ఏర్పాటు చేసి బాధితుల‌కు సాయ‌ప‌డుతున్నామ‌ని అన్నారు. ఇక‌పోతే మీరు ప‌ని చేసిన‌ ద‌ర్శ‌కులంద‌రి నుంచి మీరేం నేర్చుకున్నారు?“ అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త ప్ర‌శ్నిస్తే.. “సింపుల్ ప్ర‌శ్న‌లు అడ‌గరోయ్‌“ అంటూ ల‌క్ష్మీ అంతే ఫ‌న్నీగా ట్వీటేశారు. ప‌వ‌న్‌తో `నేను సైతం` ఎపిసోడ్ చేయొచ్చు క‌దా? అని ఓ అభిమాని ప్ర‌శ్నిస్తే.. చాలాసార్లు రెక్వ‌స్ట్ చేశాను. కానీ అట్నుంచి రిప్లయ్ లేదు అని తెలిపారు ల‌క్ష్మీ. కొత్త సీజ‌న్ ప్రారంభిస్తారా? అని అభిమానులు ప్ర‌శ్నించారు. మొత్తానికి స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో ల‌క్ష్మీ హాయిగా ద‌స‌రాని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments