విడాకులు తీసుకున్న మంచు మనోజ్..కారణాలు ఇవే.!

Thursday, October 17th, 2019, 05:49:52 PM IST

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో మంచు మనోజ్ కూడా ఒకరు.తనదైన నటనతో మంచి మంచి సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ను అందించారు.అయితే మంచు మనోజ్ ను హీరోగా ఆన్ స్క్రీన్ లో ద్వేషించే వారు ఉండొచ్చేమో కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మనోజ్ ను ద్వేషించే వారు మాత్రం ఉండరని చెప్పాలి.ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి చేయూతను అందించి అందరి హృదయాలను గెలుచుకున్నారు.

కానీ తన వ్యక్తిగత జీవితం గురించి ఈరోజు మనోజ్ ఓపెన్ అయ్యారు.తాను మరియు తన భార్య అయినటువంటి ప్రణతి ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా ఈరోజు తెలిపారు.తమ మధ్య వచ్చిన కొన్ని విభేదాల మూలంగా ఇద్దరు వేరువేరుగా జీవనం కొనసాగించాలని నిర్ణయనించుకున్నామని తెలియజేసారు.తాను తనకి ఇప్పటి వరకు అండగా నిలబడిన అభిమానులకు మాత్రం తన ధన్యవాదాలు తెలుపుకున్నారు.అలాగే తనకి ఎంతో ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చి తన అభిమానులను మునుపటిలా అలరిస్తానని తెలిపారు.