బిగ్ బాస్ విన్నర్ అతనే..మంచు మనోజ్ ట్వీట్!

Wednesday, September 19th, 2018, 04:18:09 PM IST

బిగ్ బాస్ షో తుది దశకు చేరుకుంటున్న కొద్దీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అమితంగా పెరిగింది. ముఖ్యంగా ఎలిమినేషన్ కి సంబందించిన ఎపిసోడ్ కి వచ్చేసరికి హౌస్ వాతావరణం కూడా మారిపోతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే షో విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది ఇప్పుడు ప్రధానాంశం. ఇప్పటికే చాలా మంది కౌశల్ అని ఫిక్స్ అయ్యారు.

కానీ హౌస్ లో రోజు జరుగుతున్న గొడవలను చూస్తుంటే విన్నర్ ఎవరనేది ఇప్పుడే ఫిక్స్ అవ్వలేమని చెప్పవచ్చు. కానీ ఎలిమినేటైన పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కౌశల్ గెలుస్తాడని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ సంగతి అటుంచితే మంచు వారబ్బాయి మనోజ్ చేసిన ఒక కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో మనోజ్ సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు గట్టిగా ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.. ‘నాని’ అని ఎవరు ఊహించని విధంగా చిలిపిగా సమాధానం చెప్పాడు.