మన్మధుడు 2 టీజర్ రివ్యూ

Thursday, June 13th, 2019, 04:22:17 PM IST

2002 లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైన్ మెంట్ సినిమా మన్మధుడు ఎలాంటి విజయం సాధించిందో అందరి తెలుసు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 తెరకెక్కిన విషయం తెలిసిందే, ఆ సినిమా యొక్క టీజర్ తాజాగా విడుదల అయ్యింది. మన్మధుడు సీక్వెల్ తీస్తున్నారంటే అందరికి ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. “లెట్ వయస్సులో ఘాటు ప్రేమ” అనేలా టీజర్ కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరు ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అంటే వాళ్ళ గోల భరించలేక నాగ్ లోకి అసలైన మన్మధుడు బయటకు వచ్చి రొమాన్స్ చేస్తాడు.

అయితే అది వాళ్ళ మాటలు విన్న తర్వాత జరిగిందా..? లేక లోపల అలా చేస్తూ పైకి ఇలా అమాయకంగా నటిస్తున్నాడా అనేది మాత్రం టీజర్ లో అర్ధం కాలేదు. అది సినిమాలోనే చూడాలి.. ముఖ్యంగా మన్మధుడు నాగార్జున గురించి చెప్పాలి. ఇంత ఏజ్ వచ్చిన కానీ, ఏ మాత్రం గ్లామర్ విషయంలో తగ్గకుండా యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. బహుశా అది ఒక్క నాగార్జునకే సాధ్యం కాబోలు.. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు టీజర్ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. “ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే పూలు పూస్తాయా”..”కోచింగ్ ఇచ్చే వయస్సులో, బ్యాటింగ్ అవసరమా” అంటూ నాగార్జున మీద కొన్ని డైలాగ్స్ పేలాయి. ఇలాంటి ఇగో లేకుండా నాగ్ వాటిని చేయటం విశేషం..