అవతార్ వసూళ్ళను క్రాస్ చేసిన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌..!

Monday, July 22nd, 2019, 05:00:38 PM IST

సినిమా చరిత్రలోనే అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా బాక్సాఫీస్ కింగ్‌గా మారిపోయింది. 2009లో జేమ్స్‌ కామెరూన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం అవతార్‌. ఈ సినిమా అప్పట్లో ఎంతలా హిట్ అయ్యిందో అందరికి తెలుసు. హిట్ ఒకటే కాదు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్ళను సొంతం చేసుకున్న సినిమాగా చెరిగిపోని ముద్రను వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు రాబట్టి నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది.

అయితే కొద్ది రోజుల క్రితం వచ్చిన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ కూడా భారీ ఎత్తున నిర్మించారు. అయితే ఈ సినిమా అవతార్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం ఖాయమని అందరు భావించారు. అయితే అనుకున్నదే జరిగింది. 2009 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమాలు అవతార్ రికార్డ్‌ను బ్రేక్ చేయలేకపోయినా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ మాత్రం ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా మొత్తం మీదుగా 2.79 బిలియన్‌ డాలర్లు రాబట్టి బాక్సాఫీసు స్థానంలో అత్యధిక వసూళ్ళలో నంబర్ వన్ ప్లేస్‌లోకి చేరూకుంది. అయితే ఈ సినిమా చైనా, భారత్‌లో అత్యధిక వసూళ్ళను రాబట్టింది. మొత్తానికి కలెక్షన్‌ పరంగా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ మొదటి స్థానంలో నిలవగా, అవతార్ రెండో స్థానానికి పడిపోయింది.