మాస్ మహారాజ్ రవితేజ ఈ సారైనా హిట్ కొడతాడా..?

Thursday, October 25th, 2018, 08:00:00 PM IST

ఖడ్గం చిత్రంలో రవితేజ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క చాన్స్ అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఒక్క హిట్ ఒకే ఒక హిట్ కావాలి అన్నట్టుగా మారిపోయింది.తనదైన కామెడీ టైమింగ్ తో,మాస్ పంచ్ డైలాగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను అల;అలరించే హీరో కూడా రవి తేజానే, చిన్న చిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా అనిపించుకున్న రవితేజ మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషితో ఎదిగిన హీరో గా రవితేజ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసిన తర్వాత హీరోగా చాన్స్ వచ్చాక కొన్ని అద్భుత విజయాలు పరాజయాలు చవిచూశారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మాస్ మహారాజా రవితేజ కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే అని చెప్పాలి.

ఎందుకంటే ఈ మధ్య రవితేజ పరిస్థితి అసలు ఏమి బావుండట్లేదు రాజా ది గ్రేట్ చిత్రంతో హిట్ కొట్టి గాడిలో పడ్డాడు అని అనుకుంటుండగా మళ్ళీ వెంటనే “నేల టికెట్”, “టచ్ చేసి చూడు” వంటి భారీ ఫ్లాప్ లు నమోదు చేసుకున్నాడు.దీనితో మాస్ మాస్ మహారాజ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఇప్పుడు తాజాగా రవితేజ కెరీర్ లో అద్భుత విజయాలు అందించిన శ్రీను వైట్లతో “అమర్ అక్బర్ ఆంటోనీ” అని చిత్రం లో నటిస్తున్నాడు.రవి తేజ అంచనాలు అన్ని ఇప్పుడు ఈ చిత్రం మీదనే ఆధారపడి ఉన్నాయి.మరో ప్లాపు తమ అభిమాన నటునికి మళ్ళీ రాకూడదని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments