మరో సారి “సుడిగాలి సుధీర్” స్కిట్ అదుర్స్..టాప్ ట్రెండింగ్.!

Sunday, November 18th, 2018, 03:00:56 AM IST

ఈటీవీ ఛానల్ లో వచ్చే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మన తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు.ప్రతీ గురువారం మరియు శుక్రవారం వచ్చాయంటే చాలు రాత్రి 9:30 నిమిషాలకు ఈటీవీ ఛానల్ చూడాల్సిందే.ఎన్నో పనులు చేసి వచ్చే అందరికి ఈ షోలు వారు పడ్డ కష్టాన్ని అంతటిని మరచేలా చేసి కడుపుబ్బా నవ్విస్తాయి.అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీం కి ఉన్న ప్రత్యేకత అయితే వేరే స్థాయిలో ఉంటుందనే చెప్పాలి.

నిన్న వారి టీం ఆటో రామ్ ప్రసాద్,గెటప్ శ్రీను మరియు సుధీర్ లు చేసిన స్కిట్ కు ఇప్పుడు అనూహ్యమైన స్పందన వస్తుంది.ఒక సినిమాని తియ్యాలనే తపనతో ఉన్న దర్శకునికి అతని సినిమాలో నటించే నటులు మిరపకాయలు తినడం వల్ల వచ్చే సన్నివేశాలను అత్యంత హాస్యపూరితంగా చూపించడంతో యూట్యూబ్ లో ఒక్క రోజు గడవక ముందే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇప్పుడు వీరి స్కిట్ యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నడుస్తుంది.వీరి స్కిట్ అటు బుల్లితెర మీద మరియు ఇటు యూట్యూబ్ లో కూడా హిట్ గానే నిలిచింది.