నాడు ఎదగడానికి కాంప్రమైజ్… నేడు ఎదిగాక.. మీ..టూ.. సంచ‌ల‌నం రేపుతున్న మ‌హిళా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు..!

Wednesday, October 17th, 2018, 05:10:52 PM IST

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా మీ..టీ ఉధ్య‌మం తీవ్ర‌రూపం దాల్చుతోంది. తెలుగులో బాల‌కృష్ణా స‌ర‌స‌న వీర‌భ‌ద్రా చిత్రంలో న‌టించిన బాలీవుడ్ హాట్ భామ త‌నుశ్రీద‌త్తా.. ప్ర‌ముఖ న‌టుడు నానా పాటేక‌ర్ పై లైంగిక‌వేధింపుల ఆరోప‌ణ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక అక్క‌డి నుండి మొద‌లైన కాస్టింగ్ కౌచ్ ర‌చ్చలోకి వ‌రుస‌గా బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక వారిలో ముఖ్యంగా బాలీవుడ్‌కి చెందిన నానా పాటేక‌ర్, అలోక్‌నాథ్‌, ద‌ర్శ‌కులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘ‌య్‌, పేర్లు బ‌య‌ట ప‌డ్డాయి. కేంద్ర‌మంత్రి ఎంజే అక్బ‌ర్ కూడా త‌మ‌ను వేధించాడంటూ ప‌లువురు మ‌హిళ‌లు ఆరోప‌ణ‌లు చేయ‌గా.. ఆయ‌న వెంట‌నే స్పందించి అవన్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లని వాటిని నిరూపించాల‌ని లేక‌పోతే చ‌ట్ట‌పరంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఎంజే అక్బ‌ర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇక్క‌డ‌ బాలీవుడ్ భామ‌లు మీ.. టూ పేరుతో చేస్తున్న ఆరోప‌ణ‌ల పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొంద‌రు మీ..టూకి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా.. మ‌రికొంద‌రు ప‌బ్లిసిటీ కోసం కొంత‌మంది ఇలా చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఎందుకంటే గ‌తంలో ఎప్పుడో వారిపై లైంగిక వేధింపులు జ‌రిగితే అప్పుడు ఏందుకు కామ్‌గా ఉన్నార‌ని.. ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఇదే విష‌యం పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎంపీ ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లు సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొంత‌మంది మ‌హిళ‌లు కెరీర్‌లో ఎదుగుద‌ల కోసం సొంత ప్ర‌యోజ‌నాల కోసం.. విలువలు, సిద్ధాంతాలు విడిచి రాజీప‌డ‌తార‌ని ఉషాఠాకూర్ అన్నారు. డ‌బ్బుకోసమో, ఉద్యోగం కోస‌మో లేక వ్యాపారంలో ఉన్న‌త స్థానానికి చేరుకోవ‌డానికి నాడు రాజీ ప‌డి ప్ర‌యోజ‌నాలు పొంది.. తీరా త‌మ కోర్కెలు తీర్చుకుని.. ప‌నులు చ‌క్క‌బెట్టుకుని పైకి వ‌చ్చాక మీ..టూ అంటూ ఉధ్య‌మాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఉషాఠాకుర్ ఆరోపించారు. దీంతో ఈ మ‌హిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.