“సైరా” కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు.!

Saturday, July 13th, 2019, 07:09:48 PM IST

RRR సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం మిగిలి ఉండడంతో ఇప్పుడు మెగాభిమానుల చూపులు అన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “సైరా నరసింహా రెడ్డి” చిత్రంపైనే ఉన్నాయి.తన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు 200 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇప్పటికే షూటింగ్ ముగిసిపోయిన చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.అలాగే వచ్చే అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పుడు కష్టపడుతుందని కూడా తెలుస్తుంది.

మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర్య ఉద్యమకారుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సినిమాకు అప్డేట్స్ ను వదులుతారని అన్నారు ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా ఇవ్వలేదని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి దర్శకుడు సురేందర్ రెడ్డి లేట్ చెయ్యకుండా అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెడితే సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిన వారవుతారు మరి ఏం చేస్తారో చూడాలి,ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్,కిచ్చ సుదీప్,నయనతార,అనుష్క,తమన్నా ఇలా భారీ తారాగణం ఉంది.