“మెగా” ఈవెంట్ కు మెగా ప్లాన్..!

Sunday, August 25th, 2019, 11:37:02 PM IST

ఇప్పుడు మన తెలుగు భాష నుంచి వస్తున్న సినిమాల్లో ఒక్క సాహో మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన “సైరా నరసింహా రెడ్డి” సినిమా కూడా మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ కు మరో సారి తెలుగు సినిమా దెబ్బ రుచి చూపించేందుకు సిద్ధంగా ఉంది.ఇటీవలే విడుదలైన టీజర్ కు అద్భుత స్పందన రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత ఎక్కువయ్యిపోయాయి.దీనితో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు మరింత ఉవ్విళ్లూరుతున్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు ఎలాంటి నటులు నటిస్తున్నారో కూడా అందరికి తెలుసు.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్,సుదీప్,విజయ్ సేతుపతి లాంటి అగ్ర తారాగణం కనిపిస్తుండగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా అంతే స్థాయిలో భారీగా చేయనున్నట్టు తెలుస్తుంది.ఈ మెగా వేడుకకు మరింత క్రేజ్ వచ్చే విధంగా నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ ఈవెంట్ కు గాను ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజినికాంత్ రాబోతున్నట్టుగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఒకేవేళ ఇదే కానీ నిజమైతే ఒకే వేదిక మీద ఆల్ ఇండియాలోని టాప్ స్టార్లను చూస్తామని సినీ ప్రేమికులు అంటున్నారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అక్టోబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.