ఫ్రాన్స్ దేశంలో మెగా హీరో ల‌వ్ గేమ్స్‌?

Tuesday, April 24th, 2018, 03:15:21 AM IST

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ ప్ర‌స్తుతం డోలాయ‌మానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్‌, ఇంటెలిజెంట్ లాంటి డిజాస్ట‌ర్లు ఈ యంగ్ హీరోని బ్యాక్ బెంచ్‌కి ప‌రిమితం చేశాయి. `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమా త‌ప్ప‌, ఇంత‌వ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్కటి కూడా బంప‌ర్ హిట్టు అన్న టాక్ లేక‌పోవ‌డంతో సాయిధ‌ర‌మ్ పూర్తిగా డీలా ప‌డిపోయిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఈ వెన‌క‌బాటు ఎంతో టెన్ష‌న్ పెట్టేదే. అయితే ఒకే ఒక్క హిట్టు ద‌క్కించుకుంటే, మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వ‌డం ఏమంత క‌ష్టం కాదు. అందుకే ఈసారి ప‌వ‌న్ మామ‌కు `తొలి ప్రేమ‌` లాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని ఇచ్చిన క‌రుణాక‌ర‌న్‌తో క‌లిసి న‌వ్య‌పంథా ల‌వ్‌స్టోరీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా అటు కరుణాక‌ర‌న్‌కి పాథ్ బ్రేకింగ్ మూవీ కావాల్సి ఉంది. అలానే మేటి మెగా ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావును తిరిగి ప‌ట్టాలెక్కించే సినిమా కావాల్సిన స‌న్నివేశం ఉంది. అందుకే అంతా క్ష‌ణం తీరిక లేకుండా శ్ర‌మిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. `తేజ్‌.. ఐ ల‌వ్ యు` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారని తెలుస్తోంది. హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో ఇటీవ‌లే ఓ కీల‌క‌ షెడ్యూల్‌ని ముగించారు. ఈనెల 28 నుంచి ఫ్రాన్స్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం చిత్ర‌యూనిట్ రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు విమానం టిక్కెట్లు బుక్ చేశార‌న్న స‌మాచారం అందింది. ఫ్రాన్స్ లొకేష‌న్స్‌లో ప్ర‌త్యేకించి ఎగ్జోటిక్ లొకేష‌న్స్‌ని ఎంపిక చేసుకుని ఈ పాట‌ల్ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న క్యూట్ గాళ్‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నాయిక‌గా న‌టిస్తోంది. అనుప‌మ న‌టించిన సినిమాల‌న్నీ హిట్లే. మిగ‌తావ‌న్నీ ఐరెన్ లెగ్‌లు అనుకున్నా, అనుప‌మ ఛామ్‌, గోల్డెన్ లెగ్ ఈ సినిమాకి క‌లిసొస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments