రవితేజ సినిమాలో మెగా హీరో…డబుల్ ఎనర్జీ తో ఫుల్ మాస్..!

Sunday, May 17th, 2020, 10:41:25 PM IST


మెగా హీరోలంతా ఇపుడు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరు నుండి వరుణ్ తేజ్ వరకూ. ఇప్పటి వరకు చిరు, పవన్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఇతర హీరోలతో సినిమాలు చేశారు. అయితే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సైతం మాస్ మహా రాజ రవితేజ తో నటించేందుకు సిద్దం అవుతున్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న రవితేజ, తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేసేందుకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తుంది.అయితే ఈ పాత్ర సినిమాలో కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే ఉండనుంది అని సమాచారం. అయితే ఈ పాత్రకు సాయి మాత్రమే న్యాయం చేయగలరు అని భావిస్తున్నారట.

అంతేకాక ఇపుడు సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లవ్ ఉన్నారు. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో సాయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక సోలో బ్రతుకే సో బెటర్ అంటూ మరొక చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆగింది. మరి రవి తేజ తో అంటే డబుల్ ఎనర్జీ పక్కా, అది కూడా మాస్ చిత్రం అయితే ఇక ఈ మెగా హీరో కి తిరుగు ఉండదు అని అభిమానులు భావిస్తున్నారు. మరి దీని పై అధికారిక ప్రకటన ఎపుడు వస్తుందో చూడాలి.