మెగా అప్డేట్ : చిరు కొరటాల కలయికలో కామెడీనా…?

Friday, October 18th, 2019, 12:43:15 AM IST

ప్రస్తుతానికి సైరా చిత్ర విజయానందంలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖులు నుండి ఎంతో ముఖ్యమైన ప్రశంసలు అందుతున్నాయి. కాగా అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్టు అయినటువంటి సైరా చిత్రాన్ని ప్రముఖులందరికి చూపించే ప్రయత్నం లో చిరు చాలా బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇక ఆలస్యం చేయకుండా తన 152 వ సినిమాని త్వరగా పట్టాలెక్కించి పనిలో కూడా ఉన్నారు మన మెగాస్టార్. అయితే సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రానున్నటువంటి ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. కాగా వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం.

అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక కొత్త వార్త ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చరణ్ మరియు కొరటాల కలయికలో ఒక సినిమా రావాల్సింది. ఆ చిత్రంలో చరణ్ హీరోగా కనిపించాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇకపోతే ఇపుడు రామ్ చరణ్ నిర్మాతగా, కొరటాల దస్ర్శకుడిగా రానున్నటువంటి చిత్రంలో చిరు హీరోగా కనిపించనున్నారు. అయితే ఇలాంటి సమయంలోఒక ఆసక్తికరమైన పోస్టు ఒకటి బయటకు వచ్చింది. రామ్ చరణ్, కొరటాల ఇద్దరూ చార్లీ చాప్లిన్ ఫోటో పక్కన పోజులిచ్చారు.

అయితే ప్రస్తుతానికి చిరు సినిమాకు చార్లీ చాప్లిన్ కి సంబందం ఏంటి అనే వార్త చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు కామెడీ టైమింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొరటాల నుండి ఇంత వరకు ఎలాంటి కామెడీ సినిమాలు రాలేదు. అయితే ఈ సినిమాలో కొరటాల తన కామెడి టైమింగ్ ని కూడా బయట పెట్టనున్నారా అనే వార్త బయటకు వచ్చింది. అందుకనే వీరిద్దరూ కూడా చార్లీ చాప్లిన్ ఫోటో పక్కన పోజ్ ఇచ్చారని సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా చిరు సినిమా అంటే అందరికి పూనకాలే కదా…