మెగాస్టార్ 152 టైటిల్‌ `రైతు`!

Thursday, October 11th, 2018, 12:24:46 AM IST

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా- న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. జార్జియాలో భారీ వార్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించి, వాటిని సాంకేతికంగా డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నారు. ఇందుకోసం చిరు టీమ్ చాలానే శ్ర‌మిస్తున్నారు. మ‌రోవైపు చిరు న‌టించే 152వ సినిమా గురించిన తాజా తాజా స‌మాచారం లీక‌వుతూ వేడి పెంచుతోంది.

ప్ర‌స్తుతం మెగాస్టార్ న‌టించే 152వ చిత్రం కోసం కొర‌టాల క‌థ రెడీ చేస్తున్నారు. ఫార్మ‌ర్ బ్యాక్‌డ్రాప్ క‌థాంశాన్ని ఎంచుకుని అందులో అద్భుత‌మైన సామాజిక సందేశాన్ని మిక్స్ చేస్తున్నాడ‌ట కొర‌టాల‌. ప్ర‌స్తుత ట్రెండ్‌లో రైతు వాస్త‌విక ప‌రిస్థితి ఏంటి? రైతుకు ఎలాంటి అన్యాయం జ‌రుగుతోంది? లాంటి విష‌యాల‌పై చిరుకు ఉన్న అవగాహ‌న‌తో వాటిమీదే క‌థను త‌యారు చేయించార‌ట‌. చిరు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని కొర‌టాల ఆ మేర‌కు స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నాడు. 2019 సంక్రాంతికి సినిమాని ప్రారంభించి, మార్చి లేదా ఏప్రిల్ 2019లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగానే పూర్తి చేస్తున్నారు. కొర‌టాల వ‌రుస‌గా నాలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్నాడు. అంత‌కుమించి బ్లాక్‌బ‌స్ట‌ర్ ని చిరుకి ఇవ్వాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నాడ‌ట‌. ఇక క‌థాంశానికి త‌గ్గ‌ట్టే రైతు అనే వ‌ర్కింగ్ టైటిల్‌ని అనుకున్నార‌ని తెలుస్తోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని స్వ‌యంగా నిర్మిస్తున్నారు.