టి ఎన్ ఆర్ కుటుంబానికి మెగాస్టార్ తక్షణ ఆర్ధిక సాయం.!

Wednesday, May 12th, 2021, 07:58:44 AM IST

ఇటీవలే మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఇంటర్వ్యూ స్పెషల్ జర్నలిస్ట్ మరియు నటుడు టి ఎన్ ఆర్(తుమ్మల నాగేశ్వర రావు) కోవిడ్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. నటునిగా సినిమాల్లోనే కనిపించినా తన ఇంటర్వ్యూస్ తో ఆయన కల్పించిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ అందుకే ఆయన మరణ వార్త విన్న ఏ ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోయారు.

మరి ఇదిలా ఉండగా ఈ కాస్త సమయంలో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు రాగా మెగాస్టార్ చిరంజీవి విషయం తెలిసి టి ఎన్ ఆర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అలాగే వారికి తక్షణ ఖర్చులు నిమిత్తం 1 లక్ష రూపాయల ఆర్ధిక సాయం కూడా అందించారు.

దీనితో ఈ విషయాన్ని టి ఎన్ భార్య భావోద్వేగానికి లోనయ్యి చెప్పారు. టి ఎన్ ఆర్ తన 200వ ఇంటర్వ్యూ మెగాస్టార్ తోనే చేస్తానని అది తన కల అని చెప్పేవారని గుర్తు చేసుకొని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే చిరుతో పాటుగా వారి కుటుంబానికి ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు కూడా 50 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు.