ట్విట్టర్‌లో మెగస్టార్ చిరంజీవి సరికొత్త రికార్డ్..!

Saturday, May 15th, 2021, 09:10:53 PM IST

మెగస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా ఫాలోవర్స్‌ను మాత్రం గట్టిగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న చిరంజీవి కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు తనదైన సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నాడు. అయితే గత ఏడాది ఉగాది సందర్భంగా చిరంజీవి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు.

అయితే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవి ఎవరిని ఫాలో కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 1.4 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న చిరంజీవి తాజాగా ట్విట్టర్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. యువ హీరోలతో పోటీ పడుతూ ఏడాదిలోనే సోషల్ మీడియాలో ఇంతలా ఫాలోవర్స్‌ని సంపాదించాడంటేనే మెగస్టార్ క్రేజ్ ఏ మాత్రం ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇదే కాకుండా మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్‌లో కూడా నటించబోతున్నాడు.