సాహొ సుజిత్ కు చిరు సలహా…ప్లాన్ బీ వర్కౌట్ అయ్యేనా?

Sunday, May 24th, 2020, 08:24:08 PM IST


దర్శకుడు సుజిత్ చాలా తక్కువ కాలంలోనే చిరు ప్రాజెక్ట్ ను చేజిక్కించుకున్నారు. రన్ రాజా రన్ చిత్రం తో టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సుజిత్, ఈ ఒక్క సినిమా తో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం సాధించారు. సా హొ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దర్శకుని ప్రతిభ, దార్శనికత కు మరొక గొప్ప అవకాశం వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తరువాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లూసీ ఫర్ రీమేక్ లో నటించేందుకు సిద్దం ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పూర్తి చేసిన సుజిత్, చిరు కి మరొకసారి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ను వివరించారు అట. అయితే ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని చిరు సలహా ఇచ్చారట. అయితే ఈ చిత్రం ఇప్పటికే రీమేక్ చిత్రం కావడం తో తెలుగు నేటివిటీ కి తగ్గట్లు గా సుజిత్ స్క్రిప్ట్ సిద్దం చేసారు. అయితే చిరు సలహా మేరకు సుజిత్ తమ స్టయిల్లో ప్లాన్ బీ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సుజిత్ అదృష్టం ఈసారైనా విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఏమో చూడాలి.