మోడీని కలవనున్న మెగాస్టార్ – ఎందుకో తెలుసా…?

Monday, October 14th, 2019, 09:43:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన “సైరా” చిత్రం సూపర్ హిట్ గా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకొని విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుని కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి తన అద్నుతమైన నటనతో ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి నటన చూసి చాలా మంది ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన వారు చాలా మంది చిగురంజీవిని పొగుడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు.

కాగా సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి అమరావతి కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. సైరా చిత్రాన్ని చూడాలని చిరంజీవి కోరగా, ఆ విషయంలో సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 16 వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. చిరంజీవి తో పాటు గంటా శ్రీనివాస్ కూడా వెళ్లనున్నారు. అక్కడ మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో భేటీ అవ్వనున్నారు చిరంజీవి. కాగా సైరా చిత్రాన్ని చూడాలని వెంకయ్య నాయుడు నూయి కోరుతూ… రాజకీయాల కోసం చర్చించనున్నారని సమాచారం. ఆతరువాత చిరంజీవి, ప్రధాని మోడీని కూడా కలవనున్నారని సమాచారం. ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకొని తన సైరా చిత్ర విశేషాలు చెప్పి, సైరా చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రధానిని కోరనున్నట్లు సమాచారం.