ఇన్స్టా నుంచి చిరు మొట్ట మొదటి పోస్ట్..ఏమంటున్నారో పాటించండి.!

Wednesday, March 25th, 2020, 08:40:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి నిన్ననే సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న తన మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ నుంచి మొదలు పెట్టి ఈరోజు ట్విట్టర్ ను చేరుకున్నారు. అయితే ఈరోకే ఓపెన్ చేసిన ట్విట్టర్ నుంచి అప్పుడే తన మొట్ట మొదటి పోస్ట్ పెట్టేసారు.ఆ తర్వాత ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో మొట్టమొదటి పోస్ట్ చేశారు.

దానితో యావత్తు ప్రజలతో పాటుగా తన ఫాలోవర్స్ కు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు.ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పి కరోనా పై ఎవరూ భయం చెందొద్దని ప్రతీ ఒక్కరూ కుదిరినప్పుడే తమ ఇంటికి కావాల్సిన సరుకులను కొనుక్కోమని తమ దగ్గర ఉన్నదాంట్లో సరిపెట్టుకొని సహాయం కావాల్సిన వారికి మీరు కూడా సొంత సహాయం చెయ్యాలి అని సూచించారు.

అంతే కాకుండా ఇలా పొదుపు చెయ్యడం మూలాన సమాజంలో తక్కువ చెత్త పేరుకుంటుందని ఈ రకంగా సమాజంలో పారిశుధ్యాన్ని కూడా ఒక రకంగా తగ్గించిన వాళ్ళం అవుతామని అందుచేత తప్పకుండా చేద్దామని పిలుపునిచ్చారు.మెగాస్టార్ తన మొట్టమొదటి వీడియోతోనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. దీనిని ప్రతీ ఒక్కరూ తప్పకుండా పాటించండి.