ఇప్పుడు మొట్ట మొదట స్టార్ట్ చెయ్యబోయేది మెగస్టారే.?

Saturday, May 23rd, 2020, 11:16:01 PM IST

ప్రస్తుత లాక్ డౌన్ నిమిత్తం దాదాపు రెండు నెలల పాటు షూటింగ్స్ నిలిచిపోయాయి. కానీ ఎట్టకేలకు మెగాస్టార్ చిరు సహా ఇండస్ట్రీలోని ఇతర పెద్దలు సహా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో కీలక చర్చలు జరిపిన అనంతరం పలు ఆంక్షలతో షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చారు. దీనితో మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది.

వచ్చే జూన్ నుంచి షూటింగ్స్ మొదలు కానుండగా మొదట కొన్ని చిత్రాలు మాత్రమే ట్రైల్ షూట్స్ లో పాల్గొననున్నాయి. అందులో భాగంగా మొట్ట మొదట మెగాస్టార్ చిరు సినిమాతోనే మొదలు కానున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు కొరటాల శివథి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” షూటింగ్ తోనే ఈ ట్రైల్స్ మొదలు కానున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ మార్గదర్శకంగా నిలవబోతుంది అని చెప్పాలి.