మ‌హేష్‌కి సైడ్ క్యారెక్డ‌ర్‌ ఇచ్చాడు!

Monday, April 23rd, 2018, 09:50:44 PM IST

“కెరీర్‌లో 35 సినిమాలు చేశాను. ఫ‌స్ట్‌టైమ్ జెన్యూన్‌గా ఓ సినిమా చేశానంటే అది మెహ‌బూబా“ అని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు పూరి జ‌గ‌న్నాథ్‌. నేడు హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో `మెహ‌బూబా` సినిమా సంగ‌తులు స‌హా పుత్ర‌ర‌త్నం, న‌వ‌త‌రం హీరో ఆకాష్ సీక్రెట్స్‌ని లీక్ చేశారు.

పూరి మాట్లాడుతూ -“మెహ‌బూబా చిత్రాన్ని దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు అన‌గానే ఎన్నో ఫోన్లు వ‌చ్చాయి. ఆయ‌న జ‌డ్జిమెంట్‌ని న‌మ్ముతాం అని ప్ర‌శంసించారు. ఇండ‌స్ట్రీలో ఏ ఫిలింమేక‌ర్‌కి లేని ట్ర‌స్ట్ దిల్ రాజు సంపాదించుకున్నాడు. సందీప్ చౌతా సంగీతం, భాస్క‌ర్ భ‌ట్ల పాట‌ల‌తోనే స‌గం హిట్ట‌యింది సినిమా“.. అని అన్నారు. ఆకాష్ గురించి చెబుతూ-“ఆకాష్ 4-5 ఏళ్ల వ‌య‌స‌ప్పుడు ఉద‌యం లేవ‌గానే క‌ళ్లు తెరిచేస‌రికి నా ముందు ఉండేవాడు.. చిరంజీవి గారి డైలాగ్ చెప్ప‌డం ఒక వేషం అడ‌గ‌డం.. బాల‌కృష్ణ సినిమా చూసి వేషం అడ‌గ‌డం చేసేవాడు. ఆ టార్చ‌ర్ త‌ట్టుకోలేక `చిరుత‌` సినిమాలో వేషం ఇచ్చాను. త‌ర‌వాత పోకిరి టైమ్‌లో నా ద‌గ్గ‌ర‌కొచ్చి మ‌హేష్‌కి ఓ క‌థ రాశాను. నాన్నా విను.. అన్నాడు. ఏమో వీడి ద‌గ్గ‌ర ఏం క‌థ ఉందో అని విన్నాను. మ‌హేష్‌బాబుకి ఓ 10ఏళ్ల కుర్రాడు ఫ్రెండు. వీడిని చూడ‌కుండా మ‌హేష్ ఉండ‌లేడు. ఒక‌సారి విల‌న్లు అంతా మ‌హేష్‌ని చంపేశారంట‌. వీడు(ప‌దేళ్ల కుర్రాడు) ప‌గ‌తో వెళ్లి .. ఆ విల‌న్ల‌ను ఎలా చంపేశాడు? అన్న‌దే క‌థ‌. ఈ క‌థ మ‌హేష్‌కి చెప్ప‌మ‌న్నాడు. మ‌హేష్ నిన్ను -న‌న్ను ప‌ట్టుకుని తంతాడు. వీడు హీరోగా రాసుకుని మ‌హేష్‌కి సైడ్‌ క్యారెక్ట‌ర్ ఇచ్చాడు. అప్పుడే త‌న‌కో స‌ల‌హా ఇచ్చాను. ప‌దేళ్ల త‌ర‌వాత నీతో నేను సినిమా చేయొచ్చు.. చేయ‌క‌పోవ‌చ్చు… డ‌బ్బులు ఉంటాయో ఉండ‌వో నాకే తెలీదు.. నీ ప్ర‌య‌త్నాలు నువ్వు చేసుకో అన్నాను. అప్ప‌టినుంచి ఇంటికి ఎవ‌రొచ్చినా వ‌దిలేవాడు కాదు.. రాజ‌మౌళి వ‌చ్చినా.. వినాయ‌క్ వ‌చ్చినా కాళ్లు ప‌ట్టేసుకుని అవ‌కాశం అడిగేవాడు. ఇప్పుడిలా ల‌క్కీగా నేనే డైరెక్ట్ చేశాను“ అని తెలిపారు. మొత్తానికి మెహ‌బూబా ప్రెస్‌మీట్‌లో పూరి ఆకాష్ గురించి టాప్ సీక్రెట్స్ లీక్ చేసేశారు. మే 11న మెహ‌బూబా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments